బుల్లితెర మీద రోజురోజుకు కొత్త కొత్త టాక్ షోస్ పెరిగిపోయాయి. సమంత నిర్వహించిన "సామ్ జామ్" బాలకృష్ణ చేస్తున్న " అన్ స్టాపబుల్" ఆలీ నిర్వహించిన " ఆలీతో సరదాగా" ఈ షోస్ అన్నీ ఈ మధ్య కాలంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన షోస్. ఇప్పటి వరకు ఒక మూసలో వచ్చిన ఈ షోస్ అన్నీ ఒక ఎత్తు..ఇప్పుడు రాబోతున్న కొత్త షో మరో ఎత్తు అన్నట్టుగా ఒక టాక్ షో త్వరలో రాబోతోంది..దానికి సంబంధించిన ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఓటిటి రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అన్నీ షోస్ కి భిన్నంగా అంతకు మించి కంటెంట్ తో నేను వస్తున్నా అంటోంది సింగర్ స్మిత.. ఆమె నిర్వహిస్తున్న "నిజం విత్ స్మిత" సరికొత్త టాక్ షో ఫిబ్రవరి 10 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక రీసెంట్ గా రిలీజ్ ఐన ప్రోమో చూస్తే గనక ఇందులో నారా చంద్రబాబు నాయుడు, చిరంజీవి, నాని, రానా, అల్లరి నరేష్, దేవ్ కట్టా, సందీప్ వంగా, అడివి శేష్, రాధిక, సాయిపల్లవి, అనిల్ రావిపూడి, మేజర్ భారత్ రెడ్డి లాంటి చాలామంది స్టార్స్ కనిపించారు. చంద్రబాబునాయుడు వెన్నుపోటు గురించి, నాని నేపోటిజమ్ గురించి, రాధిక వుమన్ పవర్స్ గురించి, సీరియస్ ఎమోషన్స్ గురించి అనిల్ రావిపూడి, సినిమా వాళ్ళ సమాజం చెడిపోతోంది అంటూ దేవా కట్టా, అభ్యుజింగ్ గురించి సాయి పల్లవి ఇలా వీళ్లంతా రకరకాల టాపిక్స్ మీద చాలా బోల్డ్ గా ఈ షోలో మాట్లాడారు.
ఈ షో ప్రోమో చూస్తుంటే అన్ని రంగాల వాళ్ళను ఈ వేదిక మీదకు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా వాళ్ళ చేత చెప్పించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. హోస్ట్ స్మిత కూడా "నిజం నిర్భయంగా" అని చెప్పి ఈ ప్రోమోని ఎండ్ చేసింది. సింగర్ స్మిత ఏది చేసిన సంథింగ్ స్పెషల్ గానే గుర్తుండిపోయేలాగే చేస్తుంది అనే టాక్ ఆడియన్స్ లో ఉంది. మరి ఈ షో కూడా అంతకు మించి అన్నట్టు ఉంటే గనక ఇక దాని రేటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక నెటిజన్స్ "ఈ షో అన్ స్టాపబుల్ కి గట్టి పోటీ ఇస్తుంది" అని కామెంట్స్ చేస్తున్నారు.